Skip to main content

ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ఒంటె భంగిమ)

సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ (ధనురాసన)కు ఊర్ధ్వ శర భంగిమ (ఊర్ధ్వ ధనురాసన)కు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచండి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొనండి. నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి.

మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.మడమలను గట్టిగా పట్టుకుని నడుము మరియు తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల వరకు అలాగే ఉండిపోవాలి. తర్వాత ఈ స్థితినుంచి బయటకు వచ్చి మామూలుగా నీలింగ్ పొజిషన్‌కి వెళ్లండి. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా చేతులను సడలించి నీలింగ్ పొజిషన్లో శరీరాన్ని గట్టిగా ఉంచండి.

ప్రయోజనాలు-

మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచింది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రిస్తుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది.

ఈ భంగిమను క్రమం తప్పకుండా చేస్తే ఫాటిగ్యూ, రుతుసంబంధ అసౌకర్యాన్ని, ఆత్రుతను నివారిస్తుంది.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.