Skip to main content

ఈ నాలుగు యోగ ఆసనాలతో నిత్యయవ్వనంగా కనిపించండి

వయసు మల్లడం అత్యంత సహజ పరిణామం. కొన్ని యోగ ఆసనాల ద్వార వయసు మల్లడాన్ని పూర్తిగా అపకున్నప్పటికిని, కొంచెం వాయిదా వేయవచ్చు. ఈ యోగాసనాలను పరిశిలిద్దాం. 

మాలసాన

యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ళ మధ్య కనీసం ౩ ఫీట్ల వెడం ఉండేలా చూడండి.  ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోసిషన్ లోకి తీసుకురండి. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర వంచి మీ కోర్ బాగాన్ని కిందకు దించండి స్లోగా. వీలైనంతగా కిందకు దించండి. ఇలా ౩ నుండి 4 సెకండ్స్ ఉంచి తిరిగి సాదారణ స్థితిలోకి రండి. ఇలా 5/6 సార్లు చేయండి.

ఉత్కటాసన

ఇది శరీరంలోని వివిధ సాగులను సమర్దవంతంగా ఎదుర్కొంటుంది, ముఖ్యంగా పిరుదల బాగంలో ఏజ్ తో పాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి.  రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడండి. రెండు చేస్తులు దండం పెడ్తున్న పోజ్ లోకి తీసుకురండి. చేతులను తలపైకి అలాగే లేపండి. ఇప్పుడు మెల్లిగా మోకాళ్ళ దగ్గర వంచి. శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకురండి. ఇలాగె ఒక 5/6 సెకండ్లు ఉంది తిరిగి మొదటి పోసిషన్ లోకి రండి. దిన్ని ౩/4 పునరావృత్తం చేయండి.

 పుర్వోత్తనాసన

ఈ ఆసనం నితరుగు నిలబడడానికి దోహద పడ్తుంది. యోగామ్యాట్ పై కాళ్ళను విస్తార పరుస్తూ కూర్చోవాలి. రెండు కాళ్ళను దగ్గరగా ఉంచండి., అరిచేతులను మీ పక్కాల నేల పై పెట్టండి.  ఇప్పుడు మెల్లిగా మీ మధ్య బాగాన్ని పైకెత్తండి. మీ బరువంత మీ చేతులు మరువు హీల్స్ పై పడేలా శారిరాన్ని ఒక లైన్ లో తీసుకురావాలి. ఇలా 4/5 సెకండ్లు ఉంచి రెండు మూడు సార్లు పునరావృత్తం చేయండి.

చతురంగాసన

ఈ ఆసనం  శరీరం లో జారిపోతున్న పటుత్వాన్ని తిరిగి నింపుతుంది.  ఒక ర కంగా ఇది ప్లాంక్ లాంటి పొస్తిఒన్ గ చెప్పుకోవచ్చు. కాని కొంచం నిదానంగా శ్వాశ ను గమనిస్తూ చేస్తే ఎక్కువగా ప్రభావాతం చేస్తుంది. బోర్ల పడుకొని అరి చేతులపై బలం వేస్తూ బాడి ని నేలపై లేపండి. పాదాల చివరల్ని నేలపై ఉంచుతూ శారిరని విల్లుల ఒక లైన్ లో ఉంచుతూ శ్వాసను బిగపట్టి బరువుననంత పొట్టపై తీసుకోండి. ఇలా 3/4 సెకండ్స్ ఉంచి తిరిగి ప్రదమ పోసిషన్ లోకి రండి.




Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.