Skip to main content

భుజంగాసన భంగిమ మరియు దాని ప్రయోజనాలు

భుజంగాసనం చాలా శక్తివంతమైన భంగిమగా పేర్కొనవచ్చు, ఈ ఆసనాన్ని అనుసరించటం వలన వెన్నుముకలో కలిగే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. వెన్నుముక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొనే వారు దీనిని అనుసరించటం వలన నొప్పుల నుండి మరియు వెన్నెముక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ఆసనం అనుసరించాల్సిన విధానం


ఈ రకమైన భంగిమలో, స్వతహాగా శరీరాన్ని వంచాలి, అనగా నుదురు భాగం భూమికి అనుకునేలా నెలపై పడుకోండి. ఆ తరువాత మీ అర చేతులను నెలపై ఉంచి శరీర సగభాగాన్ని లేపండి, మీ కాళ్ళను అలానే చాపి, పైన పటంలో తెలిపిన విధంగా కాలి యొక్క బొటన వేలును నెలకు తాకి ఉంచండి. ఈ భంగిమను చేసిన తరువాత, గాలిని పీల్చండి, వదలండి. ఈ విధంగా చేయటం వలన మీ శరీర బరువు తగ్గుతుంది, ఈ భంగిమ చూడటానికి పాము వాలే ఉండటం వలన కోబ్రా భంగిమ అని కూడా అంటారు.

భుజంగాసన వలన కలిగే ప్రయోజనాలు


ఈ రకమైన ఆసనాన్ని నిపుణుల వద్ద నేర్చుకున్న తరువాత, ఇంట్లోనే రోజు అనుసరించవచ్చు. భుజంగాసనను రోజు ఇంట్లో అనుసరించటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి
వెన్నెముకకు బలాన్ని చేసూరుస్తుంది

'కోబ్రా' భంగిమగా పేర్కొనబడే ఈ ఆసనాన్ని అనుసరించటం వలన శరీర వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడి, బలాన్ని చేకూరుస్తుంది. వెన్నెముక పైభాగం మరియు క్రింది భాగం ఒత్తిడి కలిగేలా ఈ ఆసనం నిర్మితం చేయబడింది. కానీ, తీవ్రమైన వెన్నునొప్పిని కలిగి ఉంటె మాత్రం, ఈ ఆసనాన్ని వేసే ముందు మీ వైద్యుడిని కలవటం క్షేమం.

అంతర్గత అవయవాలను ఉత్తేజపరుస్తుంది


భుజంగాసన వలన భౌతిక పరంగానే కాకుండా, అంతర్గత శరీర అవయవాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, జీర్ణాశయ సమస్యలతో భాదపడే వారికి ఈ ఆసనం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వలన అంతర్గత అవయవాలను ఉత్తేజానికి గురి చేసి, జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది.

ఉదరభాగంలో కొవ్వు


యోగా ఆసనాల వలన, శారీరకంగానే కాకుండా, అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అనగా ఈ ఆసనాన్ని అనుసరించటం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా తగ్గిపోతుంది. రోజు భుజంగాసనను అనుసరించటం వలన పొట్ట చుట్టూ ఉండే కండరాలపై ఒత్తిడి పెరిగి, కొవ్వు కరిగిపోతుంది.

మానసిక ఒత్తిడి నిర్వహణ


ఉద్రేకత మరియు డిప్రెషన్ వంటి వాటిని కలిగి ఉండి, సతమతం అవుతున్నారా! అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి. భుజంగాసనను రోజు అనుసరించటం వలన, అలసట, తలనొప్పి మరియు బలహీనత వంటి వివిధ రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వీటితో పాటుగా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను కూడా ఈ ఆసనం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ మైగ్రిన్ లేదా ఇంసోమ్నియా వంటి సమస్యలు కలిగి ఉన్న వారు ఈ ఆసనాన్ని అనుసరించటానికి ముందు నిపుణుల సలహాలను తీసుకోవటం చాలా మంచిది.

రక్త పరసరణను మెరుగుపరుస్తుంది


శక్తివంతంగా మరియు చైతన్యవంతంగా ఉండటానికి, మెరుగైన రక్తప్రసరణ అవసరం. భుజంగాసన వలన కలిగే మరొక ప్రయోజనం- రక్త ప్రసరణలో మెరుగుదల. మీ శరీర రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే, శరీర కణాలకు కావలసిన పోషకాలు మరియు ఆక్సిజన్ సరఫరా అధికంగా జరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వలన హార్మోన్'లు కూడా సరైన స్థాయిలో విడుదల అవుతాయి.

ఆసనాలను అనుసరించే ముందు అవగాహన లేదా నిపుణుల సలహాలను తీసుకొని అనుసరించటం చాలా మంచిది.


Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.