Skip to main content

సౌందర్యానికి యోగా... ఏయే ఆసనాలు వేస్తే బ్యూటీ...?

అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇంకా ఇంకా అందంగా ఉండాలంటూ తహతహలాడుతుంటారు. అంతేకాదు కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా గురువులు. యోగా చేయడం వలన అమ్మాయిలు సెక్సీగా కూడా ఉంటారంటున్నారు యోగా నిపుణులు. యోగాతో ముఖం, శరీరంలో కాంతి వస్తుంది. 
 శరీర రంగు ఏదైనా ఉండొచ్చు. కాని ముఖంలో కళ ఉట్టిపడాలంటే తప్పనిసరిగా యోగా చేయాలి. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి మీపైనే ఉంటుంది. ముఖంలో ఉట్టిపడే కళకు మనయొక్క కడుపుకు సంబంధం ఉంది. ఇవి రెండు శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుగు ఉపాయాలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలంటున్నారు యోగా నిపుణులు.

1. కంఠాన్ని శుభ్రం చేసుకోవాలి. 

2. నోటికి సంబంధించిన వ్యాయామము, బ్రహ్మముద్ర. 
3. సర్వాంగాసనం మరియు శీర్షాసనం వేయాలి. 
4. జలనేతి మరియు కపాల భాంతి ప్రాణాయామం. వీటిని చేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి.

శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగా కూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడి వుంటుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉంటే అది వెన్నెముకకు, శరీర కండరాలకు హాని చేస్తుంది. అలాగే శరీరంలో అసలు కొవ్వే లేకుంటే కూడా చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికి కూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా నిపుణులు.

1. సూక్ష్మమైన వ్యాయామం చేయండి.

2. ఆరు ఆసనాలు తప్పనిసరిగా చేయాలి- తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం. 
3. ప్రాణాయామం. 
4. మాలిష్. ఇవి చేస్తే సౌందర్యరాశి అవుతారంటున్నారు.

ఇవి తప్పనిసరిగా చేస్తే శరీర రంగు ఏదైనా ఉండొచ్చు అమ్మాయిల శరీరం కోమలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖం కళ కళలాడుతుంది. అలాగే ఆహారంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు యోగా గురువులు.


Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.