Skip to main content

యోగాసనాల అనుసరణ వలన పురుషులకు కలిగే ప్రయోజనాలు

యోగ యొక్క స్థిరమైన సాధన వలన మీ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. యోగ వలన మానసిక ఒత్తిడి, మానసిక ఏకాగ్రత అభివృద్ధి చెందుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.
పూర్తి శరీరానికి పని చేస్తుంది

యోగ వలన పురుషులలో బలాన్ని, శక్తి మరియు వశ్యతను మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామాలు శరీర అభివృద్ధితో పాటు, కండరాలు మంచి ఆకృతి సంతరించుకునేలా సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ యోగాసనాలను అనుసరించటం వలన శరీర బరువు తగ్గటమేకాకుండా, శరీరం సమతుల్యతంగా నిర్వహించబడుతుంది.

శక్తి & ద్రష్టిలో మెరుగుదల


యోగాసనాలు మీలో పునరుద్దరించటం లేదా శక్తి స్థాయిలను మెరుగుపరచటం మరియు సంతోషంగా ఉంచే 'ఎండార్ఫిన్' హార్మోన్ ల విడుదలను ప్రోత్సహిస్తాయి. నిజానికి యోగ యొక్క ముఖ్యోద్దేశం- స్వతహాగా ఎలాంటి హాని కలిగించుకోకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించటం.

వశ్యత లేదా ఫ్లెక్సిబులిటీ పెంపుదల


అధిక తీవ్రతగల వ్యాయామాలు మరియు ఎక్కువ సమయం పాటు జిమ్ లో వ్యాయామాలను చేయటం వలన శరీరంలో 'లాక్టిక్ ఆసిడ్' కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. కానీ, యోగ వ్యాయామాల తరువాత విడుదలయ్యే అధిక లాక్టిక్ ఆసిడ్ ను శరీరం నుండి భయటకు పంపి, ఒత్తిడి మరియు టెన్షన్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఒత్తిడిని తొలగిస్తుంది


ప్రస్తుతకాలంలో, ఒత్తిడి అనేది చాలా మంది పురుషులకు ఒక పెద్ద సమస్య మరియు చాలా మంది ఒత్తిడి వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఫలితంగా, ఏకాగ్రత తగ్గి, ఆహార సేకరణలో లోపాలను కలిగించి మరియు నిద్ర లేకుండా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మనసుకు శిక్షణ కలిగించే మంచి మార్గంగా యోగాను పేర్కొనవచ్చు.

మరింత యవ్వనంగా


అన్ని మానసిక, భౌతిక మరియు పూర్తి ఆరోగ్యం పరంగా యోగ మంచి భావనకు గురిచేసి యవ్వనంగా కనపడేలా చేస్తుంది. కానీ, రోజు యోగ అనుసరించే వారిలో మాత్రమే ఈ రకమైన ప్రయోజనాలను పొందవచ్చు. సహనంతో, సమయాన్ని కేటాయించటంతో పాటుగా, చుట్టూ ఉండే వారిలో మీతో సమాన అభిప్రాయాలు గల వారితో యోగ అనుసరించటం ద్వారా యవ్వనంగా ఉంటారు.  






Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ యోగసనాలు చేయండి

సాధారణంగా యోగలో కొన్ని భంగిమలున్నాయి. వీటినే ‘ఆసనాలు' అని అంటుంటారు. ఈ ప్రత్యేక స్థానాలు(పొజిషన్స్) లేదా ప్రత్యేక ఆసనాలతో మీ శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రసరణ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ ఆసనాలు మానవ శరీరంలో ప్రభావితం అయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడుతాయి.  యోగసనాలలో ఒక ముఖ్యమైన వాస్తవాల్లో ఒకటి ధ్యానం మరియు బ్రీతింగ్ ను కంట్రోల్ చేయడం. ఇది మొదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజు కనీసం 20 నిముషాలు యోగ చేయడం వల్ల మీ పనితనం మెరుగుపడుతుంది మరియు మీ వర్కింగ్ మెమరీకూడా మెరుగ్గా ఉంటుంది. మెదడు చురుకుగా ఉండటం కోసం వివిధ రకాల యోగాసనాలున్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ సాధన చేసినట్లైతే మీరు ఒక ఖచ్చితత్వం స్థాయి చేరుకోవడంతో పాటు, మొదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మెదడు మీద యోగసనాల యొక్క ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. ఈ యోగసనాల్లో కొన్ని మీ మెదడు యొక్క పనితీరు సరైన కార్యాచరణకు సహాయపడుతుంది.  ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన కొన్ని యోగసనాలను రెగ్యులర్ గా మీరు ప్రతి రోజూ అనుసరించాలి. ఈ యోగాసనాలన...