Skip to main content

సిగరెట్'పై ఉన్న వ్యామోహాన్ని తగ్గించే యోగాసనాలు

యోగా ఆసనాలను అనుసరించటం ద్వారా, శరీరంలో కలిగిన ప్రమాదాలను సహజంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా, ఈ ఆసనాల వలన రోగనిరోధక వ్యవస్థలో పెంపుదల, ఆక్సిజన్ సరఫరాను పెంచి, శక్తి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వీటితో పాటుగా సిగరెట్ తాగటాన్ని కూడా మానేసే ప్రక్రియలో సహాయం చేస్తుంది. సిగరెట్ మాన్పించే యోగాసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

యోగేంద్ర ప్రాణాయామ-1


ఇది చాలా సులభమైన మరియు చాలా సంవత్సరాలుగా సిగరెట్ వలన శరీరంలో కలిగిన ప్రమాదాన్ని తగ్గించే ఆసనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, రోజు ఈ ఆసనాన్ని అనుసరించటం వలన సిగరెట్ తాగాలనే కోరిక తగ్గిపోతుంది. యోగేంద్ర ప్రాణాయామ-1 ఆసనం, శ్వాసక్రియా శ్వాసక్రియాను సమతుల్యంగా ఉంచటమే కాకుండా, ఉచ్వాస మరియు నిచ్వాసల సమయాన్ని సమానంగా ఉండేలా చేస్తుంది మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. సిగరెట్ వలన కళ్ళలో మరియు చర్మంపై ఏర్పడిని ప్రభావాలను కూడా తగ్గించి వేస్తుంది. ఈ ఆసనం ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనకరం. యోగేంద్ర ప్రాణాయామ-1 వలన శారీరక భాష మరియు మీపై నమాకాన్ని కూడా పెంచుతుంది.

 

అనుసరించే విధానం


    ఈ ఆసనంలో, సుఖాసన లేదా, వజ్రాసన భంగిమలో కూర్చిండి.
    సౌకర్యవంతంగా, ఎలాంటి భంగాలు కలుగనట్టి ప్రాంతంలో కూర్చిని, నెమ్మదిగా గాలిని 5 సెకన్'ల పాటూ పీల్చండి. ఇలా రోజు రోజుకి ఈ శ్వాస తీసుకునే సమయాన్ని పెంచండి.
    శ్వాస తీకుకోవటం పూర్తయిన తరువాత, కొద్ది సమయం పాటూ ఊపిరిని బిగబట్టి అదే విధానంలో గాలిని వదులుతూ, అంతే సమయంలో గాలిని వదలండి. ఇలా చేయటం వలన ఉచ్వాస, నిచ్వాస సమయం సమానంగా ఉంటుంది.
    ఈ ఆసనాన్ని రోజు ఉదయం మరియు పడుకునే ముందు చేయండి.
    మంచి ఫలితాల కోసం రోజు 10 సార్లు అనుసరించండి.

యోగేంద్ర ప్రాణాయామ- 4


ఈ ఆసనం వలన సిగరెట్ పై మొహం తగ్గటమే కాకుండా, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ మనస్సును శాంత పరచి, మెదడులోని కీమో రిసెప్టార్'ల సున్నితత్వాన్ని క్రమబద్దీకరిస్తుంది.

అనుసరించే విధానం


    వీపును నేలకు తాకించి పడుకోండి.
    మోకాళ్ళ వద్ద వంచి, రెండు కాళ్ళను జతపరచి, సౌకర్యవంతంగా, శరీరానికి దగ్గరగా తీసుకోండి.
    నెమ్మదిగా మీ చేతిని నాభి ప్రాంతంలో ఉంచండి.
    తరువాత మీ శ్వాసను గమనించండి.
    శ్వాసను తీసుకొన్నపుడు నాభి పైకి వస్తుంది, అలానే 3 సెకన్ల పాటు ఉంచండి. శ్వాస వదిలినపుడు, నాభి కిందు చేరుతుంది ఈ సమయంలో కూడా 3 సెకన్ల పాటు అలానే ఉండండి.
    కానీ, ఈ ఆసనం అనుసరించే సమయంలో, ఉచ్వాస, నిశ్వాస ప్రక్రియలో చాతి కదలకుండా చూసుకోండి.


లక్ష్యాన్ని అధిగమించుటకు ఇతర మార్గాలు


    సిగరెట్ మానేయాన్ని ఇప్పటి నుండే ప్రారంభించండి.
    సిగరెట్ మానే ప్రక్రియలో మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయాన్ని తీసుకోండి.
    సిగరెట్ తాగటం వలన కలిగే నష్టాలను ఒక పేపర్ పైన రాసి, సిగరెట్ తాగాలని అనిపించిన ప్రతి సారి చదవండి.
    సిగరెట్ తాగటం వలన కలిగే లాభాలను రోజు గుర్తు తెచ్చుకోండి.
    సిగరెట్ మానటానికి చాలా సమయం పడుతుంది కావున ఓపికగా ప్రయత్నించండి.

ఇక్కడ తెలిపిన ప్రతి ఆసనం ప్రతి ప్త్రత్యేక విశిష్టత కలిగి ఉంది, ఆసనాలను అనుసరించే ముందు యోగా నిపుణుల వద్ద శిక్షణ తీసుకోవటం మరవకండి.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.