Skip to main content

సెలబ్రిటీల బరువు తగ్గించే రహస్యాలు

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించటం తప్పని సరి, కొన్ని తెలివైన ఆలోచనలు మరియు ఇక్కడ తెలిపిన రహస్యాల ద్వారా మీ బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

మంచి నిద్ర


అటూ ఎక్కువ సమయం లేదా అతి తక్కువ సమయం కూడా పడుకోవటం మంచిది కాదని "క్యుబెక్ లవాల్ యూనివర్సిటీ" వారు జరిపిన పరిశోధనలలో తెలిపారు. రోజులో 7 నుండి 8 గంటల  సమయం పాటూ పడుకునే వారితో పోలిస్తే, 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుకునే వారు మరియు 6 గంటల సమయం కంటే తక్కువ పడుకునే వారు శరీర బరువు పెరుగుతారని ఈ పరిశోధనలలో వెల్లడించారు

ఎక్కువ సమయం నడవట


రోజు ఉదయాన లేసి వ్యాయామాలు చేసే సమయం లేని వారు, ఒక పీడోమీటర్ కొనిక్కొని,, రోజు దాదాపు 10,000 అడుగుల నడవటం వలన 100 కెలోరీలు కరిగించిన వారవుతారు. ఇలా చేయటం వలన సంవత్సర కాలంలో 10 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉంది. 

ఎక్కువగా నీటిని తాగటం


ఎక్కువగా నీటిని తాగటం వలన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువగా నీటిని తాగాక పోవటం వలన కాలేయం మరియు కిడ్నీల పై భారం పడుతుంది. ఎలాగంటే, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల ద్వారా శక్తిని తయారు చేసి నిల్వ ఉంచటం కాలేయం విధి. నీటిని తాగని ఎడల రెండు కీలక అవయవాల విధిలో లోపాలు ఏర్పడతాయి. కావున దాహంగా ఉన్న లేకున్న సరైన స్థాయిలో నీటిని తాగండి.

గ్రీన్ టీ తాగండి


శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలలో 35 నుండి 43 శాతం వరకు కొవ్వు పదార్థాలను రోజు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ తాగటం ద్వారా కరిగించుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి.  గ్రీన్ టీ చేసే సమయం మీకు లేకుంటే, గ్రీన్ సప్లిమెంట్ లను తీసుకున్న సరిపోతుంది. 

ఆహారాన్ని ఎక్కువ సమయం పాటూ నమలండి


నెమ్మదిగా తినండి, మీరు అధికంగా తిన్న తరువాత కొన్ని నిమిషాల వరకు కూడా మన శరీరం గుర్తించదు. కావున మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని కనీసం 8 నుండి 12 సార్లు నమలాలి. ఇలా చేయటం వలన తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవును. 






Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...