Skip to main content

పరిపూర్ణ ఏకాంత యోగ అభ్యాసాన్ని అందించే ఉత్తమ ప్రదేశాలు

రోజువారీ ప్రాపంచిక పట్టణ జీవితం మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు తగినంత నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా, వీటిన్నింటి నుండి ముక్తిని ఆశిస్తున్నట్లయితే, 'యోగ' కంటే మెరుగైన ఎంపిక వేరేది ఉండకపోవచ్చు. యోగ యొక్క శక్తి మీ ఆలోచనలను లోపల నుండి బయటకు వెలికి తీస్తుంది. యోగ మరియు ధ్యానం యొక్క నిర్మలమైన శక్తి మీ జ్ఞానమును నిలిపి ఉంచడానికి సహాయం చేస్తుంది.

యోగ అనే కళను నేర్చుకోవడానికి గాను, యోగ సాధనను అందించే ఉత్తమమైన ప్రదేశాల జాబితాను ఇక్కడ తెలియచేయడం జరిగింది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్


ఈ సంస్థ యొక్క పేరులోనే పూర్తి విషయం తెలుస్తుంది. దీనిని గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ గారు స్థాపించారు, ఒత్తిడిని తొలగించుకోవడానికి ఈ స్థలం ఒక ఉత్తమ ఎంపిక. ఈ సంస్థ యొక్క కార్యక్రమాల లక్ష్యం భారతదేశంలోని వారి జీవన నాణ్యత మెరుగుపరచడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు మన జాబితాలో ప్రధమ స్థానంను ఇవ్వడం జరిగింది. వీరి యొక్క జ్ఞాన సమృద్ధ కార్యక్రమాలు మీరు మెరుగైన జీవితం గడపడానికి సహాయం చేస్తాయి.

అయ్యంగర్ యోగ సెంటర్ యోగక్షేమ


మనస్సు, శరీరం మరియు ఆత్మలకు శాంతిని చేకూర్చడం కోసం అన్వేషణలో ఉన్నట్లయితే, దీని కోసం గాను యోగాను ఎంచుకొని ఉంటారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుండి ఈ స్థలంలో యోగా 'సూత్రాలలో' మంచి ప్రావీణ్యం కల్గిన శిక్షకుల చేత, మీకు కావాల్సిన విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. సంస్థ వారితో సంప్రదించి, వర్క్ షాప్ హాజరుకు గాను మీ పేరును నమోదు చేసుకోండి.

యోగ లైఫ్


ఒక మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపడమే లక్ష్యం కలిగిన వారికి యోగ కంటే మెరుగైన ఎంపిక వేరొకటి ఉండదు. ఇక్కడ, యోగ జీవితం మీరు ఏదైనా సాధించడానికి గాను ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.  యోగ లోని అన్ని "ఆసనాలను" వారి పద్దతులలో ఉత్తమంగా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడి శిక్షకులు మరియు వాలంటీర్లు మీ జీవితం పై మీకు ఒక స్పష్టమైన అవగాహన కలిగించడానికి గాను, ఉన్నతమైన జ్ఞానం సాధించడానికి సహాయం చేస్తారు. యోగా జీవితంతో ఒక సాధారణమైన జీవితాన్ని గడపండి.

వేదిక్ పవర్ యోగ


మీరు యోగాను ఎంచుకున్నట్లయితే, మీరు మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు ఒక మంచి సహాయం అందించినవారవుతారు. ఆసనాలు మరియు ధ్యానం చేస్తున్నపుడు సులభంగా పూర్తి శాంతిని పొందవచ్చు. వేదిక్ పవర్ యోగ వారి అనుభవజ్ఞులైన శిక్షకుల జట్టు ఒక పూర్తిగా భిన్నమైన స్థాయిలో శాంతియుత సౌరభంతో యోగాను అందిస్తూన్నందుకు గాను దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయం నుండి ధ్రువీకరణ పత్రంను గెలుచుకోవడం జరిగింది.

యోగ గురు


యోగ శక్తి నుండి యోగా శాంతిని అందించడం వరకు, సామూహిక శిక్షకుల చేత పిల్లలకు శిక్షణ అందించడానికి గాను, యోగా గురువు సంస్థ పూర్తి నైపుణ్యంను ప్రదర్శిస్తుంది. దక్షిణ ఢిల్లీ ఆధారంగా, ఈ యోగా కేంద్రం వారు మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ 'యోగా' వారిచే ధృవీకరించబడిన నిపుణుల బృందంను కలిగి ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.