Skip to main content

వెన్నుభాగంలో కలిగే నొప్పిని తగ్గించే యోగాసనాలు

నిలకడ స్థితిలో పని, లేదా కదలిక లేని జీవన విధానాల వలన వెన్నెముకలో, ముఖ్యంగా కింది భాగంలో నొప్పి కలగటం చాలా సాధారణం. తప్పుడు భంగిమ, చైతన్యరహిత జీవనం, ఎక్కువ సమయం కూర్చిని పని చేయటం, పోషకాహర లోపం వలన వెన్నుముక కింది భాగంలో నొప్పిని కలుగచేసే కారణాలుగా చాలా మంది చెబుతుంటారు. ఇది నిజమే, వీటి వలన భవిష్యత్తులో వెన్ననొప్పి కలగవచ్చు. ఇలాంటి సమస్యలు కలిగి ఉన్నా లేదా భవిష్యత్తులో ఈ నొప్పి భారినపడకుండా ఉండాలంటే ఇక్కడ తెలిపిన యోగా భంగిమలను అనుసరించండి. కానీ, వీటిని అనుసరించే ముందు నిపుణుల సహాయాన్ని తీసుకోండి. వెన్నుముక కింది భాగంలో నొప్పిని తగ్గించే యోగాసనాలు/వ్యాయామాలు ఉక్కడ తెలుపబడ్డాయి.

భుజంగాసనం


దీనినే 'కోబ్రా' భంగిమ అని కూడా అంటారు, ఈ యోగాసనం వలన వెన్నుముక భాగంలో కలిగే నొప్పులు తగ్గటమే కాకుండా, వెన్నెముక వశ్యతను (వంగేగుణాన్ని) కూడా పెంచుతుంది. ఈ ఆసనాన్ని అనుసరించే పద్దతి ఇక్కడ తెలుపబడింది.

    ఈ రకమైన భంగిమలో, స్వతహాగా శరీరాన్ని వంచాలి, అనగా నుదురు భాగం భూమికి అనుకునేలా నేలపై పడుకోండి.
    ఆ తరువాత మీ అర చేతులను నేలపై ఉంచి శరీర సగభాగాన్ని లేపండి, మీ కాళ్ళను అలానే చాపి, పైన పటంలో తెలిపిన విధంగా కాలి యొక్క బొటన వేలును నెలకు తాకి ఉంచండి.
    ఈ భంగిమను చేసే సమయంలో గాలిని పీల్చి, వదలండి.
    ఈ భంగిమ చూడటానికి పాము వాలే ఉండటం వలన కోబ్రా భంగిమ అని కూడా అంటారు.
    ఇలా చేయటం వలన వెన్నెముక నరాలపై ప్రభావం పడి, నొప్పులను మరియు యాత్ర అన్ని సమస్యలను తగ్గించి వేస్తుంది.



బ్రాహ్మ ముద్ర


దీన్ని శ్వాస సంబంధిత యోగాసనం అని చెప్పవచ్చు మరియు గాలిని పీల్చుకుంటూ, తలను తిప్పే వ్యాయామం. ఈ ఆసనాన్ని అనుసరించే విధానం కింద తెలుపబడింది.

    ఒక చదునైన నేలపై కూర్చోండి, ఈ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి. (ధ్యాన భంగిమలో)
    కానీ మీ చేతులను తొడపై ఉంచకండి.
    ఇపుడు నెమ్మదిగా గాలి పీలుస్తూ, తగిన విధంగా తలను కుడి/ ఎడమ వైపు తిప్పండి.
    అదేవిధంగా, గాలిని వదులుతూ తలను అదే స్థానానికి తీసుకురండి.
    ఇలా చేసే సమయంలో గాలి పీలుస్తూ తలను పక్కకు తిప్పిన తరువాత, ఊపిరి బిగబట్టి 10 అంకెలను లెక్కించండి.
    తరువాత తిరిగి మామూలు స్థానానికి తలను తీసుకురండి.
    ఇదే పద్దతిలో తలను పైకి, కిందకు కదపండి.
    ఈ ఆసనం వలన కండరాలు ఒత్తిడికి గురయ్యి, విశ్రాంతి దశకు చేరతాయి.
    ఇలా రోజులో కొన్ని సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

సుప్త హస్త పదాంగుస్టాసన


నిశ్చల జీవన శైలిని అనుసరించే వారికి, వెన్నెముక నొప్పులతో భాదపడే వారికి ఇదొక మంచి ఆసనం చెప్పవచ్చు. ఈ ఆసనాన్ని అనుసరించాల్సిన విధానం ఇక్కడ తెలుపబడింది.

    శ్వాసను పీల్చుకుంటూ, మీ రెండు చేతులను పక్క వైపుగా చాచండి.
    తరువాత, మీ కుడి కాలును పైకి లేపి, కుడి చేతుతో అందుకోండి.
    తిరిగి సాధారణ స్థితికి వచ్చాకా, మీ ఎడమ కాలిని కూడా, ఎడమ చేతితో అందుకోండి.

పైన తెలిపిన అన్ని రకాల ఆసనాలు, వెన్నెముక నొప్పిని తగ్గిస్తాయి కానీ, ఇక్కడ తెలిపిన ప్రతి ఆసనం ప్రత్యేక విశిష్టతతో పాటూ, అవసరాలను కలిగి ఉంది. ఈ యోగాసనాలను అసుసరించే ముందు యోగా నిపుణుల దగ్గర ప్రత్యేక శిక్షణ అవసరం. అంతేకాకుండా, యోగా వలన మీ శరీరం సౌకర్యంగా ఉందో, లేదో అని వైద్యుడిని అడిగి తెలుసుకోండి.



Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.