Skip to main content

జుట్టు రాలటాన్ని తగ్గించే యోగాసనాలు

ఆసనాల ద్వారా జుట్టు రాలటం తగ్గటం ఏంటి అని ఆలోచిస్తున్నారా! ఇక్కడ తెలిపిన ఆసనాల ద్వారా జుట్టు రాలే ప్రక్రియ తగ్గుతుంది అని ప్రయోగ పుర్వకంగా నిరూపించబడింది.

జుట్టు దువ్వె సమయంలో, కేశాలు ఎక్కువ రాలినట్లయితే, నిరాశకు లేదా చిరాకులకు గురవుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు జుట్టును దువ్వెనతో దూసిన ప్రతి సారి, జుట్టు రాలటం లేదా తెగిపోవటం వలన చాలా నిరాశకు గురవుతుంటారు.

ఒత్తిడి, హార్మోన్'ల అసమతుల్యతలు, అనారోగ్యకర ఆహార స్వీకరణ, వ్యాధులు, జుట్టు రంగువేయటం, మందులు, జన్యుపర లోపాలు, పొగత్రాగటం, ఇలాంటి కారణాల వలన జుట్టు రాలుతుంటుంది. అంతేకాకుండా, జుట్టుకు వాడే కండిషనర్ మీ పూర్తి ఆరోగ్యాన్ని

ప్రభావిత పరుస్తుంది. యోగాసనాలను చేయటం వలన మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడటమే, కాకుండా జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. యోగాలను రోజు చేయటం వలన మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

యోగా వలన సులభంగా జుట్టు సమస్యలనుండి ఉపశమనం పొందవచ్చు. జుట్టు రాఉతను తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే యోగా ఆసనాల గురించి కింద తెలుపబడింది.

బాలయమా యోగా (గోళ్ళను రాయటం)


బాలయమా యోగాను చేయటం వలన జుట్టు రాలటం తగ్గటమే కాకుండా చుండ్రూ, జుట్టు నెరవాటాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకల మొనలు లేదా ఫాలికిల్'లు గోళ్ళతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. చేతి గోళ్ళను రుద్దటం వలన శక్తి వెంట్రుకల మొనల్లకు చేరి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ రెండు చేతుల గోళ్ళను తాకించి, గోళ్ళు మాత్రమె తగిలేలా రాయండి. ఇలా కనీసం 5 నుండి 7 నిమిషాల పాటూ రాయటం వలన మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఉత్తనాసనం (నిలబడి వంగటం)


ఈ ఆసనం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఈ ఆసనంలో మీ తల గుండె కన్నా కిందకు వంచి ఉంచటం వలన తలపై చర్మానికి అధిక మొత్తంలో రక్త ప్రసరణ జరిగి, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆసనంలో, మొదటగా మీ కాళ్ళను దగ్గర చేసి, మోకాళ్ళు, పాదాలు మరియు కాలి యొక్క అన్ని భాగాలు కలిసేలా నిటారుగా నిలబడండి. తరువాత, మీ చేతులను పైకి చాచి, మీ చేతి వెళ్ళు, కాలి వెళ్ళను తాకించేలా కిందకి వంగండి. ఇలా చేస్తూ ఉపిరి తీసుకోండి.

సాసంగాసనం (రాబిట్ పోస్)


ఈ రకమైన ఆసనంలో తలను నెలకు తాకించటం వలన తలకు రక్తప్రసరణ సరిగా జరిగి, జుట్టు ఆరోగ్యం మెరుగుపడి, జుట్టు రాలటం తగ్గుతుంది. ఈ ఆసనంలో, మోకాళ్ళపై నెలపై కూర్చోని, బాలాసన భంగిమలో కూర్చిండి. ఈ సమయంలో మీ రెండు చేతులను వెనుక వైపు చాచండి. ఇలా మీ తలను నెలకు తాకించి, మీ చేతులతో పాదాలను పట్టుకునేందుకు ప్రయత్నించండి. 5 శ్వాసల వరకు ఇదే భంగిమలో కూర్చోండి.

ప్రాణయామా


ఈ ఆసనాన్ని అనుసరించటం వలన జుట్టు రాలటం తగ్గటమే కాకుండా, శరీరంలో ఉండే విష పదార్థాలు భయటకు పంపి, మెదడును శుభ్రపరచి, రక్త ప్రసరణను పెంచి మరియు జుట్టు నెరవటాన్ని తగ్గిస్తుంది. ఈ ఆసనంలో, పద్మాసన లేదా శుకాసన భంగిమలో కూర్చిండి, వెన్నెముక మరియు తలను నిటారుగా ఉంచి, కళ్ళు మూసుకోండి. మీ చేతులను మోకాళ్ళపై ఉంచి, తపస్సు చేసే జ్ఞానిలా కూర్చోండి, శ్వాసను బలంతో భయటకి పంపండి, ఫలితంగా మీ పొట్ట లోపలకు వెలుతుంది. కానీ, శ్వాస తీసుకునే సమయంలో బలాన్ని ప్రయోగించకుండా నెమ్మదిగా పీల్చుకోండి. ఇలా నిమిషాలను 60 సార్లు చేయండి.

పైన తెలిపిన యోగాసనాలన్ని జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. ఈ ఆసనాలను అనుసరిస్తూ, వివధ రకాల ఉత్పత్తులను అనుసరించే ముందు జాగ్రత్త వహించండి. ఈత నీరు అధిక క్లోరిన్ సాంద్రతలను కలిగి ఉంటుంది, కావున, ఈత కొట్టడం పూర్తయిన వెంటనే శుభ్రమైన నీటితో జుట్టును కడుక్కోండి.


Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.