Skip to main content

గుండెమంట నుండి ఉపశమనన్ని కలిగించే యోగాసనాలు

అజీర్ణత సమస్య, ఆహారం తీసుకున్న వెంటనే మండుతున్నట్లుగా ఉండే అనుభూతి మరియు ఆమ్లాల ప్రతిచర్య కారణంగా జీర్ణప్రక్రియలో తీవ్రమైన మంట ఏర్పడుతుంది, దీనిని సపోర్టేడ్ బ్యాక్ బెండ్స్ మరియు ఇన్వెర్శన్స్ (తలక్రిందులుగా ఉండడం) వంటి యోగాసనాలు సాధన చేయడం ద్వారా తగ్గించవచ్చు మరియు శారీరక వ్యవస్థను శాంతింప చేయవచ్చు. గుండెల్లో మంట నుండి ఉపశమనాన్ని పొందగలిగే కొన్ని యోగ ఆసనాలను ఇక్కడ తెలియజేయడమైనది.


లెగ్స్-అప్- ద-వాల్ భంగిమ

దశ-1


లెగ్స్-అప్-ద-వాల్ భంగిమ చేయటానికి, ఒక గోడకు అభిముఖంగా ఉండండి. కాలి వేళ్ళను గోడకు అభిముఖంగా ఉండేట్లు నిర్ధారించుకోవాలి. మీ వీపును నేలకి ఆనించి గోడకు కాళ్ళను నిఠారుగా ఉంచాలి. మీ పిరుదులను గోడకు దగ్గరగా తీసుకురండి. ఎగువ వెన్ను భాగాన్ని, మెడను నేల పై పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు, మీ శరీరం "L" ఆకారంలో ఉంటుంది.

దశ-2


T ఆకారంలో వేషంలో ఉన్నట్లుగా మీ చేతులను విస్తృత పర్చండి. మోచేతులని 90 డిగ్రీల వరకు వంచండి. మీ అరచేతులు పై కప్పు వైపు చూస్తున్నట్లుగా ఉంచండి మరియు ముంజేతులను నేలపై ఉంచి విశ్రాంతిని కల్పించండి. తుంటి భాగం దూరం వరకు మీ కాళ్లను విస్తరించండి, పాదాలను వంచాలి, మరియు మీరు పైకప్పు పై నిలబడినట్లుగా ఊహించుకోండి. మీ కళ్ళను మూసుకొని ఐదు నిమిషాల పాటు లెగ్స్-అప్- ద-వాల్ భంగిమలో ఉండండి.

దశ-3


ఈ భంగిమలో కొన్ని నిమిషాలు ఉన్న తర్వాత మీ కాళ్లలోని ఒత్తడిని వదిలేసిన అనుభూతిని పొందండి. లెగ్స్-అప్- ద-వాల్ భంగిమలోని విలోమాల వలన పొత్తికడుపు ప్రాంతంలో రక్త ప్రసరణ పెరిగి జీర్ణక్రియ సమస్యలకు సహాయపడుతాయి.



సపోర్టేడ్ బ్రిడ్జ్ భంగిమ

దశ-1



వీపును నేలకు ఆనించి పడుకోండి మరియు మీ అరికాళ్ళను నేలపై ఉంచండి. ఒకసారి మీ పాదాలు నేల పై ఉన్నట్లుగా మోకాళ్ళను వంచండి. తుంటి దూరం వరకు కాళ్లను విస్తృత పర్చండి. మీ వీపు ఎగువ మరియు దిగువ భాగాలు యోగా చాపతో సంబంధం కలిగిఉన్నట్లుగా అనుభూతి పొందండి. మూడు సార్లు ఊపిరి తీసుకోండి.


దశ-2



ఒక యోగ బ్లాక్ ను తీసుకోండి, మీ తుంటి భాగాన్ని పైకి ఎత్తండి మరియు ఆ బ్లాక్ ను త్రికాస్థి వెనుక కుడ్యము (పిరుదులకు కొంచెం పైనకు) క్రిందన నేరుగా పెట్టండి. బ్లాక్ పై మీ తుంటి భాగాన్ని పూర్తిగా వదిలేయండి మరియు మీ చేతులను కాలి తొడలకు ఇరువైపులా తీసుకొని వచ్చి అరచేతులు పై కప్పును చూస్తున్నట్లుగా ఉంచండి. మీ వీపు, పాదాలు మరియు భుజాలు నేలకు ఒత్తిడి కలిగిస్తున్నట్లుగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. యోగ బ్లాక్స్ వివిధ పరిమాణాలలో లభిస్తాయి. కావున, మీ సౌకర్యవంతాన్ని బట్టి అత్యల్ప మరియు అత్యధిక స్థాయిలను ప్రయోగించి పరీక్షించవచ్చు.


దశ-3



బ్యాక్ బెండ్ సహాయంతో అలానే 40 సెకన్ల పాటు ఉండాలి, మీ శరీరం క్రింది నుండి బ్లాక్ ను తొలగించండి మరియు తుంటి భాగాన్ని, వీపును తిరిగి నేలపై ఉంచండి. డయాఫ్రాగమ్ ను పైకి ఎత్తడానికి బ్యాక్ బెండ్స్ సహాయాన్ని అందిస్తాయి, ఇలా చేయడం వలన పొట్టలో కలిగి ఉన్న ఎలాంటి భారమయిన తొలగిపోతుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని లోపాలను పరిష్కరించగలిగే అత్యుత్తమ ఉపాయం.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.