Skip to main content

పవర్ యోగా తో ఆరోగ్య ప్రయోజనాలు!

యోగా అనేది ప్రపంచమంతా కూడా ఏ దేశంవారైనప్పటికి చేయటానికి ఇష్టపడతారు.
 యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు. మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు పవర్ యోగా కూడా చేయవచ్చు. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి పవర్ యోగా ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. 
బరువు తగ్గటం - 
పవర్ యోగాలో కేలరీలు బాగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో తేలికైనది మరియు సమర్ధవంతమైనది. మీ శరీరంలోని అధిక బరువు కరిగిపోవాలంటే, పవర్ యోగా ఆచరించండి. దీనిని మీరు ఇంటి వద్దే చేయవచ్చు. లేదా యోగా తరగతులలో చేరి కూడా ఆచరించవచ్చు.

శరీరం తేలికైపోతుంది - 

పవర్ యోగా లో మీ శరీరంలోని అన్ని భాగాలు కదలిక చేయబడతాయి. మీ శరీరం దీనిలో చేసే ఆసనాలు అంటే, సాగతీయటం, వంగటం వంటి వాటితో ఎంతో తేలికవుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

 శరీర జీవక్రియ పెరుగుతుంది - 

యోగా చేస్తే, శరీర మెటబాలిజం ఎంతో బాగుంటుంది. దీనికి కారణం పవర్ యోగా లో మన మైండ్ బాగా విశ్రాంతి పొంది మంచి ఆహ్లాదకరమైన భావనలు కలుగుతాయి. ఆ విధంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో చురుకుగా ఉంటారు. 

బ్లడ్ సర్కులేషన్ -

పవర్ యోగా లో మీకు బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది. శరీర రక్తప్రసరణ పెరిగి వ్యాధులు దరికి చేరవు. 

రోగ నిరోధకత పెరుగుతుంది -

 పవర్ యోగా రెగ్యులర్ గా సాధన చేస్తే, మీ శరీర రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. అధిక ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రవేసిస్తుంది. ఇది మీ శరీరం తన జీర్ణ క్రియను మెరుగుపరచుకోటానికి, మలినాలను బయటకు వదిలేయటానికి పనికి వస్తుంది. దానితో జీర్ణక్రియ పెరిగి, మీ చర్మంలో మెరుపు కూడా ఏర్పడుతుంది.

 వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు- 

మీకు కనుక కేన్సర్, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ లేదా నిద్రలేమి వంటివి ఇప్పటికే ఉంటే, పవర్ యోగాతో వీటిని సహజంగా నివారించుకోవచ్చు. రోగులైనప్పటికి మితంగా దీనిని ఆచరిస్తూ, తమ శరీరాన్ని మంచి ఆరోగ్యంలో ఉంచుకోవచ్చు. 

ఒత్తిడి, డిప్రెషన్ - 

యోగాతో మీకు రోజులో వచ్చే ఒత్తిడి, మానసిక వేదన వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడి మీకు కోపం తెప్పిస్తూంటుంది. అటువంటపుడు ఇది బాగా పనిచేస్తుంది. జంటలమధ్య వివాదాలు రాకుండా వారు మనోవేదనకు గురికాకుండా ఉంటారు. అటువంటి మానసిక సమస్యలకు మీరు తప్పక యోగా ప్రయత్నించండి. సమస్యలు తగ్గటమే కాక, మానసిక, శారీరక విశ్రాంతి దొరుకుతుంది. 
పవర్ యోగాతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. రోజూ చేస్తే, మరింత ఫిట్ గా చురుకుగా ఉంటారు. నిద్ర సరిగా పట్టని వారికి యోగాతో చక్కటి నిద్ర పట్టి మరుసటి రోజు హాయిగా ఉంటుంది. కనుక పవర్ యోగా తప్పక ఆచరించండి.




Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.