Skip to main content

జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే వక్రాసనం

పద్మాసన భంగిమలో చేసే ఆసనమే వక్రాసనం. సంస్కృతంలో వక్ర అంటే వంకర లేక వంపు అని అర్థం. వెన్నెముకను శరీరంలో ఒక వైపుకు వంకరగా తిప్పగలిగే ఆసనమే వక్రాసనం.

చేసే పద్ధతి -

కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.
కుడికాలిని పైకి మడిచి ఎడమ మోకాలి వద్దకు మీ కుడిపాదాన్ని జరపండి.
ఎడమ చేతిని కుడి మోకాలు పై భాగాన నిటారుగా చాపి ఉంచండి.
కుడి చేతిని వీపు వెనుక ఆధారం కోసం ఆనించండి.
వెన్నెముకను నిటారుగా ఉంచి ఎడమ చేతితో కుడి కాలివేళ్లను పట్టుకోండి
ఛాతీ భాగాన్ని మరింతగా కుడివైపుకు తిప్పి మెడను మీ వెనుక వైపుకు తిప్పి ఉంచండి
వీలైనంత సేపు ఈ స్థితిలో అలాగే ఉండండి.
మెడను, ఛాతీ భాగాన్ని ముందువైపుకు తిప్పి, చేతిని వదిలి, కాళ్లను చాచండి.
దండాసనం భంగిమలో కూర్చోండి.

ప్రయోజనాలు

వెన్నెముకను ఉత్తేజపరుస్తుంది.
వీపు కుడి ఎడమ వైపులకు సులువుగా తిరిగేలా చేస్తుంది.
జీర్ణవ్యవస్థకు మెత్తగా మర్దన జరుగుతుంది కాబట్టి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
నడుము పట్టడం, కండరాల నొప్పి తగ్గిపోతాయి.
మెడపట్టకుండా, సులువుగా తిరగడానికి ఇది తోడ్పడుతుంది.

జాగ్రత్తలు-

వీపు, మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.
కీలు సంబంధ సమస్యలు ఉన్నవారు లేదా స్పాండిలైటిస్ వ్యాధి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.