Skip to main content

ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగించే 4 యోగాసనాలు

ఆహారాన్ని తీసుకున్న ప్రతిసారి జీర్ణశయ సంబంధిత సమస్యలకు గురవటం లేదా వీటికి దూరంగా ఉండటం వంటివి జరుగుతాయి. ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాం, ఏ విధంగా తీసుకున్నాం మరియు ఏ సమయంలో తీసుకున్నాం వంటి చాలా రకాల ముఖ్య విషయాలు మన ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తాయి. అనారోగ్యకర ఆహార సేకరణ వలన గురయ్యే వ్యాధుల పట్టిక పెద్దదిగానే ఉందని చెప్పవచ్చు. అజీర్ణం వలన కలిగే సమస్యనే ఎసిడిటీగా పేర్కొంటారు మరియు జీర్ణాశయ సమస్యలలో ఇది ఒకటని చెప్పవచ్చు.

జీర్ణాశయంలో జఠర రసాలను ఉత్పత్తి అధికం అవటం వలన ఎసిడిటీ కలుగుతుంది. ఆమ్ల గాడతలను కలిగిన ద్రవాల ఉత్పత్తి అధికం అవటం ఆరోగ్యానికిని మంచిది కాదు. ఇలాంటి ద్రవాలు జీర్ణాశయ లోపలి పొరను సాంద్రతను కరిగించి, అల్సర్ మరియు జీర్ణాశయ సంబంధిత వ్యాధులకు కారణం అవుతాయి. 

అయినప్పటికీ, ఇతర వ్యాదులను నయం చేసినట్లే, యోగ ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. యోగాభ్యాసనాలతో పాటుగా, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయటం వలన మీరు అసిడిటీ లాంటి సమస్యలనుండి ఉపశమనాన్ని పొందటమే కాకుండా, ఇలాంటి సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ క్రింద ఉదాహరించబడిన యోగాసనాలు జీర్ణక్రియ ప్రక్రియను సమతుల్య స్థాయిలో నిర్వహించేలా ప్రోత్సహిస్తాయి.
సుప్త బధ కోనాసన లేదా రిక్లైండ్ బౌండ్ యాంగిల్

ఈ యోగాసనం మీ జీర్ణక్రియకు మద్దతుగా చేకూరుస్తుంది. ఈ ఆసనం కడుపులోని వాయువులను భయటకి పంపేలా చేసి తీవ్రమైన ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గర్భంతో ఉన్న స్త్రీలు మరియు భుజ ప్రాంతంలో గాయాలు కలిగిన వారు ఈ యోగాసనం అనుసరించటం శ్రేయస్కారం కాదు.
సేతు బంధాసన లేదా బ్రిడ్జి ఫోస్

మీరు అనుసరించే అనారోగ్యకర ఆహార సేకరణ వలన జీర్ణాశయ గోడల లోపలి వైపు ఉన్న పొరపై ప్రతికూల ప్రభావాలను మరియు ఒత్తిడులను కలుగచేస్తాయి. ఈ విధంగా కలిగిన ఒత్తిడి, ఎసిడిటీని నిర్మూలలించటం చాలా ముఖ్యం. వెనుకకు వంగే ఈ రకమైన యోగాసనంను అనుసరించటం వలన శారీరక మరియు మానసిక విశ్రాంతిని పొందుతారు.


హలాసన లేదా నాగలి ఆసనం

ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగించుటలో ఈ రకం ఆసనం అత్యంత ఉపయోగకరమని చెప్పవచ్చు. ఈ ఆసనం మీ మానసికంగా మరియు శారీరకంగా విశ్రాంతి చేకూర్చటమే కాకుండా జీర్ణాశయంలో ఉత్పత్తి చెందే జఠర రసాలను గణనీయంగా తగ్గించి ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వజ్రాసనం

భోజనం చేసిన వెంటనే ఈ ఆసనాన్ని అనుసరించటం వలన, జీర్ణాశయ సంబంధిత భాగాలకు మరియు పేగులలో రక్త ప్రసరణను అధికం చేసి, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోజు ఈ ఆసనాన్ని అనుసరించటం వలన పూర్తి జీర్ణ వ్యవస్థ శుభ్రపరబడుతుంది. కావున, ప్రతిరోజు భోజనం అనంతరం ఈ ఆసనాన్ని కనీసం 10 నుండి 15 నిమిషాల పాటూ అనుసరించటం మీ జీవనశైలిలో ఒక అలవాటుగా మార్చుకోండి.


Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.