సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లన సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చోవాలి. నడుము క్రింద భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచాలి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. మడమలను గట్టిగా పట్టుకుని నడుము, తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంత వరకు వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మూమూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6 సెకన్ల వరకు అలాగే ఉండాలి. తరువాత ఈ స్థితినుండి బయటకు వచ్చి మామూలు స్థాయికి రావాలి. ఇలా చేస్తున్నప్పుడు...