Skip to main content

Posts

Showing posts from September, 2018

ఛాతీ పరిమాణాన్ని పెంచే మత్య్సాసనం

మత్స్యాసనం చేప భంగిమలో ఉంటుంది. సంస్కృతంలో మత్స్య అంటే చేప అని అర్ధం. సాధారణంగా నీటిలో ఈ ఆసనం వేయడంలో ప్రావీణ్యం సాధించినవారు చేతులు, కాళ్లు సాయం లేకుండా ఈ ఆసనస్థితిలో పైకి తేలుతారు. చేయుపద్ధతి :  ముందుగా పద్మాసన స్థితిలోకి రావాలి. మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలి మోచేతులను వెనుకకు తీసుకురావాలి. మీ వీపును నేలకు సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో మీ మోచేతులు మరియు చేతుల సాయాన్ని మీరు తీసుకోవచ్చు. మీ చేతులను తలవైపుగా వెనక్కు ఉంచాలి. ఇప్పుడు మీ అరచేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి. మీ చేతులు భుజాలకు వ్యతిరేక దశలో ఉండాలి. మీ అరచేతులను, మోచేతులను కిందికి నొక్కి ఉంచాలి. మీ పొత్తి కడుపును, ఛాతీని ముందుకు లేపి ఉంచాలి. నడుము, వీపు, భుజాలు నేలకు తాకకుండా పైకి లేపాలి. మీ శరీరం ఇప్పుడు మీ చేతుల సాయంపై ఆధారపడి ఉండాలి. వెన్నుపూసను విల్లులాగా వంచాలి. అదే సమయంలో మీ మెడ మరియు తలను గరిష్ఠ స్థాయిలో వెనుకకు వంచాలి. మీ తల పైభాగం నేలకు తాకేలా ఉండాలి. మీ చేతులను ముందుకు చాచండి. మీ తొడల వెనుక భాగాలను పట్టి ఉంచండి. మీ పొత్తికడుపు మరియు రొమ్ముభాగాన్ని పైకి ఎత్తి ఉంచేంద...