Skip to main content

Posts

Showing posts from August, 2018

భుజంగాసనంతో శ్వాసకోశ సమస్యలకు చెక్

సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధలు నుంచి తప్పించుకోవచ్చు. వర్షాకాలంలో ఎదురయ్యే ఈ శ్వాసకోశ సమస్యలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం యోగాసనాలు. ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో భుజంగాసనం ప్రసిద్ధి చెందింది. ఈ ఆసనం రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే ఆసనం ఇదని, ప్రత్యేకించి యువతకు ఉపయోగకరమని యోగాసన నిపుణులు చెబుతున్నారు.  ఈ ఆసనం వేయడం వల్ల వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుకు బాగా శక్తివచ్చి వెన్నులోని డిస్క్‌ల సమస్యలు తగ్గిస్తుంది. నాభి వరకు బాగా సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడటమ...

నిముషానికి మీ శ్వాస 12 సార్లు... 5 సార్లకు తగ్గిస్తే ఏం జరుగుతుంది? హఠ యోగా...

హఠ యోగాతో అద్భుత ప్రయోజనాలున్నాయి.  చాలామంది కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లనే హఠ యోగా ప్రయోజనాలుగా భావిస్తుంటారు. అయితే, సద్గురు హఠ యోగా వల్ల శారీరకంగా పలు ప్రయోజనాలు లభించినా, అవన్నీ కేవలం సైడ్ ఎఫెక్టులు మాత్రమే అని  చెబుతున్నారు. మానవుని పూర్తి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి, విశ్వాన్నే మీలోకి “డౌన్లోడ్” చేసుకునేందుకు తగినట్టుగా శరీర వ్యవస్ధను మలచుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన వ్యవస్ధే ‘సాంప్రదాయ హఠ యోగ ‘అని ఆయన ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు. ఈ సృష్టి అంతా ఒక రకమయిన “జామెట్రీ” అంటే రేఖాగణితం, అలాగే మీ శరీరం కూడా. ఇది శరీరాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మారుస్తుంది. బహుశా ఈ రోజులలో, ఈ సమస్య ఇక లేదు కానీ, కొన్ని సంవత్సారాల క్రితం, తుఫాను వచ్చిపోయిన ప్రతిసారీ, పైకి వెళ్లి టీవి(TV) యాంటెనాని సరి చేసుకోవాల్సి వచ్చేది. అది ఒకవిధమైన కోణంలో ఉంటేనే మీ టీవిలో ప్రసారాలు వచ్చేవి, లేదా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడో లేదా సీరియల్ చూస్తున్నప్పుడో అకస్మాత్తుగా మీ టీవిలో చుక్కలు వచ్చేవి. అప్పుడు మీరు యాంటెనాని సరిచేయవలసి వచ్చేది. ఈ శరీరం కూడా అలాంటిదే :  మీరు దానిని సరైన స్ధితిలో ఉ...

వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే శ్వాసకోశ వ్యాధులు... ఈ ఆసనం వేస్తే...

శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం. ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ ప్రక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరుచుకోవాలి. బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి.  తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి.  లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకూ నడుము నుంచి పొట్ట, ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చెయ్యడం వలన భుజాలు, చేతులు కూడా శక్తివంతమవుతాయి.  ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి. కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు ...

శీర్షాసనం ఎవరు వేయకూడదు...? వేస్తే ఏంటి?

శీర్షాసనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆసనాన్ని నాలుగు కాళ్ళు కలిగిన ఇనుప చట్రంమీద చేతులు పెట్టడానికి అనువైన వెడల్పు భాగం మీద చేతులు వుంచి, శరీర బరువును మోసేందుకు తమ భుజాలను సిద్ధం చేసి నెమ్మదిగా కాళ్ళు పైకి ఎత్తాలి. క్రమక్రమంగా శరీరం తూలకుండా నిలుపుతూ మొత్తం శరీరం తలకిందులుగా నిలపాలి.  ఈ ఆసనంలో శ్వాసక్రియ మామూలుగా జరపాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చి కాసేవు శవాసనం వేయాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ (హైపర్ టెన్షన్) ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు కానీ శీర్షాసనం వేయకూడదు. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు.  కారణం ఈ ఆసనాలు వేస్తే రక్తం అధికంగా తల లోపలికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు వేయకూడదు. ఇలాంటి ఆసనాలు వేస్తే తలలోని రక్తనాళాలు చిట్లే అవకాశం వుందని పరిశోధనలు చెబుతున్నాయి. బీపీ తగ్గడం కోసం చేస్తున్న ఏ ఆసనం వేస్తున్నప్పుడయినా సరే మీకు కాస్త అలసటగా అనిపిస్తే వెంటనే శవాసనం వేయడం అత్యుత్తమని యోగా నిపుణులు చెపుతారు. శవాసనంలో వీలయినంత సేపు ఉండడంకోసం మీ శ్వాసని లెక్క పెట్టడం మొదలు...

టైపింగ్ పనిచేసేవారు ''మకరాసనం'' వేస్తే...

మెడనొప్పులతో బాధపడేవారు మకరాసనం వేయడం వలన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ మకరాసనం వేయడమ మంచిది. మకరాసనం అనగా ముందుగా మకరం అంటే మెుసలి అని అర్థం, ఆసనం అనగా మెుసలి రూపంలో ఉంటుంది. దీనికి నిరాలంబాసనం అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే రెండు మోచేతులను జోడించి నేలపై ఉంచి శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనస్సును నిలపాలి. అలా రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించి మోకాళ్లను చాపి ఉంచాలి. తరువాత శరీరం బరువునంతటినీ భూమిమీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలను మరచిపోయి కాసేపు అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు శాంతపడుతుంది. శరీరమంతా శీతలీకరణం చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే అధిక రక్తపోటుతో భాదపడుతున్నవారు మాత్రం ఎట్ట...

యోగాసనాలు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందా?

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోటు వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. శరీరాన్ని మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం ఇతర వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. యోగాసనాలు వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. మనస్సును శ్వాసప్రక్రియపై చేసి ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చును. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే నిపుణుల తగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన ప్రక్రియ అనే విషయాన్ని గుర్తించాలి. యోగాను మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.

నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి

పేరు వింటేనే నౌకాసనం ఎలా ఉంటుందనే విషయంపై మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. అవును నౌకాసన భంగిమ నౌకలాగే ఉంటుంది. ఇందులో అవలంభించే పద్ధతి కొద్దిపాటి తేడాలు మినహాయించి ఊర్ధ్వ పాద హస్తాసన భంగిమలాగే ఉంటుంది.  ఆసన వేసే విధానం:  • నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి.  • మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు.  • దానికి బదులు మీ భుజాలను తలదాకా చాచాలి.  • ఎగువ భుజాలు చెవులను తాకుతున్నట్టు ఉండాలి.  • గాలి పీలుస్తూ మీ కాళ్లు, నడుము, భుజాలు, మెడ, తల, అలాగే నేల నుంచి 60 డిగ్రీల కోణంలో పైకి లేపాలి.  • ఇలా చేసేటపుడు భుజాలను నేరుగా ఉంచండి.  • అలాగే మీ పాదాల వేళ్లకు సమాంతరంగా మీ భుజాలను ఉంచాలి.  • కాళ్ల వేళ్లు చేతికొనలకు సమాన స్థాయిలో ఉండాలి.  • మీ చూపును కాలి మొనలపైనే శ్రద్ధంగా పెట్టండి.  • ఈ సమయంలోనే మీ శరీరం మీ వెన్నును ఆధారంగా చేసుకుని ఉంటుంది.  • శ్వాస గట్టిగా బిగపట్టండి.  • ఇలాగే ఓ ఐదు నిమిషాల పాటు నిలవండి.  • ఇపుడు మీ శరీరం నౌకాకృతిని సంతరించుకుంటుంది. ఇలా చే...