Skip to main content

Posts

Showing posts from July, 2018

జ్ఞానేంద్రియాల పనితీరును మెరుగుపరిచే బ్రహ్మముద్ర

బ్రహ్మముద్ర ఆసనం వేయటానికి పద్మాసన, సుఖాసన, వజ్రాసనంలాగా కూర్చోవాలి. మెడను మాత్రమే తిప్పటం ద్వారా ముఖాన్ని కుడివైపుకు కదపండి. ఈ క్రమంలో గడ్డమును కుడిచేతి భుజమునకు సమాంతరంగా అవకాశం ఉన్నంతవరకూ జరపాలి. ఆసనం వేస్తున్నపుడు మీ చూపును కుడివైపుకు మరల్చిండి. ఇదే భంగిమలో ఉంటూ దాదాపు ఐదుసార్లు ఊపిరి తీసుకోవాలి. తిరిగి ఆసనం ప్రారంభ భంగిమకు రండి. ఇదే విధంగా ఆ తర్వాత ముఖమును ఎడమవైపు దిశగా తిప్పాలి. ఇంతకముందు ఎలా చేశామో అలాగే దీనిని చేయాలి.  మెడ నరాలకు కాస్త విశ్రాంతి నివ్వాలి. ఆ తర్వాత తలను వెనక్కు తిప్పాలి. తిరిగి మరలా ప్రారంభ భంగిమకు రావాలి. మెడ కండరాలను వదులుగా ఉంచండి. తలను మరలా వెనక్కు తిప్పండి. ఈ రకమైన విశ్రాంతి పొందటం ద్వారా మీపై భూమ్యాకర్షణ శక్తి తగ్గుతుంది. కనురెప్పుల వైపుకు చూపును మరల్చిండి. ఆతర్వాత ప్రారంభ భంగిమకు రావాలి. తలను కిందకుపైకూ జరిపిన తర్వాత ముఖాన్ని మెల్లగా కుడిఎడమ వైపులకు తిప్పండి. ఈ నాలుగు కదలికలు కలిసి ఒక బ్రహ్మముద్రలో భాగం అవుతాయి.  శ్వాస పీల్చటం  బ్రహ్మముద్ర మూడవ దశలో తల పైకి వంచినపుడు అలాగే నాలుగో దశలో గడ్డమును ఛాతి వైపుకు దించినపుడు శ్వాస పీల్చటం కష్టమ...

యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...

ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది, అదే యోగాసనం. ఇది మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా శరీరం లోలోపలికి తీసుకుంటుంది. మీరు యోగాచేసేటపుడు ఎంతవీలైన అంత నిదానంగా, నెమ్మదిగా శ్వాస ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలా తీసుకోవడం వలన మీరు అద్భుతమైన శక్తిని పొందవచ్చును. గాలి శరీరంలోపల ఉండగానే శ్వాసను బిగబట్టుకుని ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు యోగా చేయాలి.  మీలోని బలహీనతను, అనారోగ్యాన్ని సంపూర్ణంగా బయటకు వదిలేస్తున్నారనే భావం చెందుతుంటే దీర్ఘంగా ఉన్నశ్వాసను బయటకు నెమ్మదిగా వదిలేయాలి. గాలిని విడిచిపెట్టిన తరువాత శ్వాశ బిగపట్టాలి. అప్పుడే ప్రాణాయామం చేసేందుకు మంచిగా ఉపయోగపడుతుంది. 5 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి.   ఇలా చేయడం దివ్యశక్తిని పొందగలుగుతారు.  ఈ ప్రాణాయామం మరొక 5 నిమిషాల పాటు చేయడం వలన శరీరంలో ప్రవేశిస్తున్న ఈ దివ్యశక్తి తరంగాలను చేరుకుంటుంది. మీ శరీరంలో, మనస్సులో, ఆలోచనలు కదులుతున్న దివ్యత్వాలా అనుభూతిని చెందాలి. ధ్యానం చేస్తూ బయట ఉన్న విశ్వశక్తిని గమనించాలి. ఇలా చేయడం వలన ఆలోచనలు, టెన్షన్ నుంచి బయటపడి ప్రశాంత స్థితిని చేరుకుంటారు. ఆ ప్రశాంతమైన స్థితిలోనే దివ్యమై...

వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే శ్వాసకోశ వ్యాధులు... ఈ ఆసనం వేస్తే...

శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం. ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ ప్రక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరుచుకోవాలి. బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి.  తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి.  లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకూ నడుము నుంచి పొట్ట, ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చెయ్యడం వలన భుజాలు, చేతులు కూడా శక్తివంతమవుతాయి.  ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి. కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు వచ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

ప్రాచీన యోగసనాలు వాటి పద్ధతులు.....

అలసట, ఆందోళన, ఒత్తిడి, విసుగు, కోపం, అనారోగ్యాలు వంటికి తగ్గించుకోవడానికి కొన్ని యోగా పద్ధుతులు తెలుసుకుందాం. పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసికపరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగా పద్ధతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగా పద్ధతులను కూడా పాటించేవారు. అవేంటో చూద్దాం. ప్రాచీన యోగా పద్ధతులు:  జ్ఞాన యోగ :  జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటం. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. సృష్టి రహస్యం తెలుసుకుని దాని మూల కేంద్రాన్ని చేరుకోవటం. భక్తియోగ :  భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. తమని తాము అర్పించుకోవటం. కర్మయోగ :  ప్రతిఫలాన్ని ఆశించకుండా తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించటమే కర్మయోగాసనం. మంత్రయోగ :  మీకిష్టమైన మంత్రాన్ని లేదా శబ్దం ద్వారా రామ కావచ్చు లేదా ఓం కావచ్చు చేరవలసిన గమ్యాన్ని చేరటం. యంత్ర యోగ :  ఇష్టమైన భగవంతుని విగ్రహరూపాన్ని ప్రతిష్టించుకుని ఆరాధించటం అందులో లీనమవటం. లయ యోగ :  ఇష్టమైన దానిలో ఇమిడిపోవటం, కలిసిపోవటం, అదే లోకంగా జీవించటం. కుండలిని యోగ :  ...

టైపింగ్ పనిచేసేవారు ''మకరాసనం'' వేస్తే...

మెడనొప్పులతో బాధపడేవారు మకరాసనం వేయడం వలన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ మకరాసనం వేయడమ మంచిది. మకరాసనం అనగా ముందుగా మకరం అంటే మెుసలి అని అర్థం, ఆసనం అనగా మెుసలి రూపంలో ఉంటుంది. దీనికి నిరాలంబాసనం అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే రెండు మోచేతులను జోడించి నేలపై ఉంచి శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనస్సును నిలపాలి. అలా రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించి మోకాళ్లను చాపి ఉంచాలి. తరువాత శరీరం బరువునంతటినీ భూమిమీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలను మరచిపోయి కాసేపు అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు శాంతపడుతుంది. శరీరమంతా శీతలీకరణం చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే అధిక రక్తపోటుతో భాదపడుతున్నవారు మాత్రం ఎట్ట...