Skip to main content

Posts

భుజంగాసనంతో శ్వాసకోశ సమస్యలకు చెక్

సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధలు నుంచి తప్పించుకోవచ్చు. వర్షాకాలంలో ఎదురయ్యే ఈ శ్వాసకోశ సమస్యలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం యోగాసనాలు. ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో భుజంగాసనం ప్రసిద్ధి చెందింది. ఈ ఆసనం రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే ఆసనం ఇదని, ప్రత్యేకించి యువతకు ఉపయోగకరమని యోగాసన నిపుణులు చెబుతున్నారు.  ఈ ఆసనం వేయడం వల్ల వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుకు బాగా శక్తివచ్చి వెన్నులోని డిస్క్‌ల సమస్యలు తగ్గిస్తుంది. నాభి వరకు బాగా సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడట...
Recent posts

మకరాసనంతో పూర్తి ప్రశాంతత

మకరాసనంతో పూర్తి ప్రశాంతత లభిస్తుంది. ఉరుకులు పరుగులపై ఉండేవారికి ఈ ఆసనానం వేస్తే ఇట్టే ప్రశాంతత లభిస్తుంది. మకర అంటే మొసలి అని దాదాపు అందరికి తెలిసినదే. అంటే ఈ ఆసనం మొసలి ఆకారంతో పోలి వుంటుందన్నమాట. మకరాసనం వేసే పద్దతి నేలపై చక్కగా వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళను ఒక చోటకు చేర్చండి. భజాలు నేలపై విశాలంగా పరచాలి. పాదాల చివరభాగం ఖచ్చితంగా నేలను తాకుతున్నట్టుగా ఉండాలి. మెల్లగా ఎడమకాలిని మడవాలి. మోకాలు ఆకాశాన్ని చూపుతున్న విధంగా ఉండాలి. అదే సమయంలో కుడి చేయిని ఉన్న దిశకు వ్యతిరేకంగా తిప్పుకోవాలి. అలాగే బోర్లపడుకోవాలి. రెండు కాళ్ళను ఎడము చేయాలి. కుడిచేయి ఎడమ భుజం కింద ఉండేలా చూడాలి. ఎడమ భుజాన్ని కుడిచేత్తో పట్టుకోవాలి. అలాగే కుడిభుజం కింద ఎడమ చేయి ఉండేలా చూడాలి. కుడి భుజాన్ని ఎడమచేత్తో పట్టుకోవాలి. ఇప్పుడు మడిగి ఉన్న మోచేతుల వలన ద్వి త్రిభుజాకారము ఏర్పడుతుంది. ముంజేతులు ఒకదానికొటి క్రాస్ అవుతుంటాయి. నుదిటిని ద్వి త్రిభుజాకారము ఆనించాలి. కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ సాధన చేయాలి. శ్వాస సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.

నాలుగే ఆసనాలతో నిత్య యవ్వనంగా కనిపిస్తారు.. ఎలా...?

వయస్సు మళ్లడం సహజం పరిణామం. కొన్ని యోగాసనాల ద్వారా వయస్సు మళ్లడాన్ని పూర్తిగా ఆపకున్నా, యవ్వనంగా కనిపించే అవకాశం ఉంది. అది కూడా చాలా సులభంగా. మూలాసాన, ఉత్కటాసన, పుర్వోత్తనాసన, చతురంగాసన... ఈ నాలుగు ఆసనాలతో యవ్వనంగా కనిపించవచ్చు. ఇవి చేయడం చాలా సులభమే.. యోగా మ్యాట్ పైన నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడంగా చేస్తూ సుమారుగా రెండు కాళ్ళ మధ్య కనీసం మూడు అడుగులు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోజిషన్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాళ్ళను దగ్గరకు వంచి మీ కోర్ భాగాన్ని కిందకు దించాలి. స్లోగా వీలైనంత కిందకు దించాలి. ఇలా మూడు నాలుగు సెకండ్లు ఉంచి తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకోవాలి. ఇలా ఐదారు సార్లు చేయాలి. అలాగే ఉత్కటాసన.. ఇది శరీరంలోని వివిధ సాగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పిరుదల భాగంలో ఏజ్‌తో పాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగ మ్యాట్ పైన నిటారుగా నిలబడాలి. రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడాలి. రెండు చేతులు దండం పెడుతున్న పోజ్ లోకి తీసుకురావాలి. చేతులను తలపైకి అలాగే లేపాలి. ఇప్పుడు మెల్లగా మోకాళ్ళ దగ్గర వంచి శర...

యోగాతో వృద్ధ మహిళలకు స్థిరత్వం....

వృద్ధ మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన యోగా ప్రక్రియతో ముసలి వయస్సులో తూలి పడిపోకుండా శరీరాన్ని సమతూకంగా ఉంచుకోవచ్చని వైద్య పరిశోధకులు పేర్కొన్నారు. మహిళలకోసం ప్రత్యేకంగా రూపొందించిన యోగా ప్రోగ్రామ్‌లో 24 మంది వృద్ధ మహిళలల్లో శారీరక పటుత్వం, సమతుల్యతమెరుగుపడినట్లు నిర్ధారించారు. 9 వారాలు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న 65 ఏళ్ల వృద్ధ మహిళల నడకలో సమతూకం గణనీయంగా మెరుగుపడిందని ప్రకటించారు. యోగా కార్యక్రమంలో మహిళలు తమ నడకను ఎంతో మెరుగుపర్చుకున్నారని వారి పాదాల్లోని నరాలు పటుత్వం సాధించి వారి నడకకు స్థిరత్వం కల్పించాయని అధ్యయనంలో వెల్లడైంది. గతంలో వృద్ధ మహిళలకు కఠినతరమైన యోగాభ్యాసం నేర్పించేవారని, ఈ కొత్త ప్రక్రియలో శ్వాస, నిలబడడం, యోగా భంగిమ వంటివి సరళరూపంలో మార్చి అభ్యాసం చేయించినట్లు పరిశోధనలో తెలిపారు. ఈ తాజా ప్రక్రియలో పాల్గొన్న కొందరు మహిళలకు వీపు నొప్పి, మోకాలి నొప్పి వంటివి పూర్తిగా తొలగిపోయినట్లు తెలియజేశారు.

రోజూ యోగా చేస్తే.. ఎంత ప్రయోజనమో తెలుసా? మధుమేహానికి.. పద్మాసనం...

రోజుకు అరగంట పాటు యోగా చేస్తే.. వ్యాధులను తరిమికొట్టవచ్చు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా యోగసనాలు వేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఎలాంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చో క్లుప్తంగా తెలుసుకుందాం..  యోగా అనేది క్రమశిక్షణను అమలు చేస్తుంది. మనం మన మనస్సును నిగ్రహించుకుంటూ.. మనలోని ఆధ్యాత్మిక భావనను నిద్రలేపే ప్రయత్నమే  యోగ. ఈ యోగా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది.  క్రమంగా యోగా చేయడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. అధిక రక్తపోటుకు చెక్ పెట్టాలంటే..  పశ్చిమోస్థాసనం, మస్త్యాత్థాసనం, శశంగాసనం చేయవచ్చు.  ఆర్థరైటిస్‌కు సేతబంధాసనం, తడాసనం, శలపాసనం, దశాంకాసనం  ఆమ్లాల ఉత్పత్తికి, పశ్చిమోస్థాసనం, సర్వాంగాసనం పైల్స్‌కు పశ్చిమోస్థాసనం, వజ్రాసనం, మయూరాసనం, శశాంకాసనం, హలాసనం, సంగవంగాసనం.  మధుమేహానికి.. పద్మాసనం, హలాసనం, చక్రాసనం, శలపాసనం  హృద్రోగాలకు.. తడాసనం, శలాపాసనం, భుజంగాసనం  మహిళల నెలసరి సమస్యలకు.. హలాసనం, ధనురాసనం  ఆస్తమా.. ...

ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం....

సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లన సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చోవాలి. నడుము క్రింద భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచాలి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. మడమలను గట్టిగా పట్టుకుని నడుము, తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంత వరకు వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మూమూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6 సెకన్ల వరకు అలాగే ఉండాలి. తరువాత ఈ స్థితినుండి బయటకు వచ్చి మామూలు స్థాయికి రావాలి. ఇలా చేస్తున్నప్పుడు...

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.